Header Banner

ఈ రోజు నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో సీఐడీ సీజన్ 2! ప్రతి శని, ఆదివారం కొత్త ఎపిసోడ్లు!

  Fri Feb 21, 2025 14:54        Entertainment

క్రైమ్ థ్రిల్లర్ టీవీ షో సీఐడీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 1998 లో ప్రారంభమైన ఈ టీవీ షో 2018 వరకు ఏకధాటిగా సాగింది. మొత్తం 1547 ఎపిసోడ్లు ప్రేక్షకులను ఉర్రూలూగించాయి. కొన్ని రోజుల క్రితమే సీఐడీ సీజన్ 2 కూడా ప్రారంభమైంది.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. జగన్‌ సహా మరో 8మంది వైకాపా నేతలపై కేసు నమోదు!

 

క్రైమ్ థ్రిల్లర్ టీవీ షో సీఐడీ సీజన్ 2 ఇటీవలే ప్రారంభమైంది. మొదటి సీజన్ పూర్తయిన ఆరేళ్ల తర్వాత గతేడాది డిసెంబర్ నుంచి కొత్త సీజన్ మొదలైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీ లివ్ ఓటీటీలోనే ఈ క్రైమ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటి వరకూ కొత్త సీజన్ లో మొత్తం 18 ఎపిసోడ్లు పూర్తయ్యాయి. అయితే ఇప్పుడీ షో మరో ఓటీటీలోనూ స్ట్రీమింగ్ కు రానుండటం విశేషం. రెండో సీజన్ కు సంబంధించిన అన్ని ఎపిసోడ్లు మరో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రానున్నాయి.

ఇవాళ్టి రాత్రి శుక్రవారం (ఫిబ్రవరి 21) నుంచి రెండో సీజన్ కు సంబంధించిన అన్ని ఎపిసోడ్లు నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేస్తున్నాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక ప్రోమో విడుదల చేసింది నెట్‌ఫ్లిక్స్‌. ‘సీఐడీ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ దగ్గరికి కూడా వచ్చింది. సీఐడీ కొత్త సీజన్ అన్ని ఎపిసోడ్లు శుక్రవారం రాత్రి నుంచి నెట్‌ఫ్లిక్స్ లో చూడండి. అంతేకాదు కొత్త ఎపిసోడ్లు ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 10 గంటలకు స్ట్రీమింగ్‌ అవుతాయి’ అని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

సీఐడీ క్రైమ్ షోలో శివాజీ సతమ్, దయానంద్ శెట్టి, ఆదిత్య శ్రీవాస్తవ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఒక క్రైమ్ ను సీఐడీ టీమ్ ఎలా పరిష్కరిస్తుందో ఇందులో చూపించారు. ఈ షోకు దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే తొలి సీజన్ కు వచ్చిన రెస్పాన్స్ రెండో సీజన్ కు రాలేదని రివ్యూలు వస్తున్నాయి. మరి నెట్‌ఫ్లిక్స్ లో ఈ షోకి ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.

ఇకపై నెట్ ఫ్లిక్స్ లో నూ సీఐడీ సీజన్ 2 స్ట్రీమింగ్..

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

రూల్స్.. రూల్స్.. అంటాడు ఈయన పాటించడా.. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన.!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో సంస్థలు...వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #andhrapravasi #andhrapradesh #cid #entertainment #tvshow #netflixcid